సారథి న్యూస్, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని, ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం పోలీసు కమిషనర్లు, ఆయా జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసులు సంఖ్య తగ్గించేలా కృషిచేయాలన్నారు. నిందితులకు శిక్షపడేలా కృషిచేసిన ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అభినందించారు. లాక్ డౌన్ వల్ల సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. ఈ తరహా నేరాలపై నిఘా ఉంచాలన్నారు. ఖమ్మం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ తఫ్సీర్‌ఇక్బాల్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను క్లియర్ చేసేలా ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో సీసీఆర్ బీ ఏసీబీ సీఎల్నాయక్, సీఐ శివసాంబిరెడ్డి పాల్గొన్నారు.
- August 26, 2020
- Archive
- Top News
- ఖమ్మం
- DGP
- HYDERABAD
- MAHENDAR REDDY
- PENDING CASES
- డీజీపీ
- తెలంగాణ
- పెండింగ్ కేసులు
- హైదరాబాద్
- Comments Off on పెండింగ్ కేసులు క్లియర్ చేయండి