Breaking News

పల్లెలు బాగుపడాలి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. ఇందు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రానికి అవసరమైన నిధులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తప్పితే.. ఇంకెప్పుడు గ్రామాలు బాగుపడవని అన్నారు. మంగళవారం ఆయన ప్రగతిభవన్​లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు ఉపాధి పనిని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో లక్ష కల్లాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాల్సిందేనన్నారు. రాబోయే నాలుగేండ్లలో గ్రామాల్లో చేయాల్సిన పనులకు ప్రణాళికను రూపొందించాలని కోరారు. ఇందుకోసం జిల్లాల వారిగా నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు. కల్వకుంట్ల తారక రామారావు. హరీశ్​రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, ఈటల రాజేందర్. శ్రీనివాస్ గౌడ్ . రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ పాల్గొన్నారు.