రకుల్ ప్రీత్‌సింగ్ ఓ కొత్తతరహా పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలనే చేశారు. ప్రస్తుతం ఓ చిత్రంలో పల్లెటూరు పడుచు పిల్లగా మెరిపించనున్నది. ఇప్పటికే ఈ తరహా పాత్రను రంగస్థలం చిత్రంలో సమంత పోషించిన విషయం తెలిసిందే. తాజాగా రకుల్ కూడా సమంతా బాటపట్టారు. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ పేదంటి గ్రామీణ యువతిగా నటిస్తున్నది. పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ కొనసాగుతుంది. నవంబర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నారట.
- August 20, 2020
- Archive
- సినిమా
- DIRECTOR
- FOREST
- KRISH
- NEWMOVIE
- RAKULPREETH
- TOLLYWOOD
- కొత్తసినిమా
- టాలీవుడ్
- Comments Off on పల్లెటూరు పిల్లగా రకుల్