సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజాప్రతినిధులపై కరోనా మహమ్మారి పగబట్టినట్టే కనిపిస్తోంది.. ఒక్కొక్కరికీ అంటుకుంటోంది.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ చుట్టుముట్టేస్తోంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారని సమాచారం. ఒకరోజు ముందే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి కరోనా ప్రబలింది. టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగలా గణేష్ గుప్తా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పటికే కరోనా బారినపడ్డారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి కరోనా బారినపడి చికిత్స పొందినవారే. అలాగే బీజేపీకి చెందిన సీనియర్ లీడర్, హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా నుంచి చికిత్స తీసుకున్నారు.
- June 30, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CONGRESS
- CRONA
- TELANGANA
- కరోనా
- టీఆర్ఎస్
- ప్రజాప్రతినిధులు
- బీజేపీ
- Comments Off on పగబట్టిన కరోనా