Breaking News

పక్కాగా ఆస్తి వివరాల నమోదు

పక్కాగా ఆస్తి వివరాల నమోదు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: గ్రామంలోని ఇండ్లు, ఇత‌ర అన్నిర‌కాల నిర్మాణాల‌కు భద్రత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ​ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చాలని, నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలం షాహిన్ పల్లి, అల్లిపూర్, సల్కరిపేట గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్​లైన్​ ప్రక్రియను క్షేత్రస్థాయిలో శిక్షణ సహాయ కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు సర్వేను అక్టోబర్​ 10వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ధరణి యాప్ లో ఆస్తుల వివరాలను నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. స్కూళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఆస్తులకు సంబంధించి యజమాని వివరాలు, ఫొటోను అప్ లోడ్ చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​ వెంట పలువురు సర్పంచ్​లు, అధికారులు ఉన్నారు.