సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, మల్లన్న, రాజయ్య, మంకాలవ్వ, దొంతరబోయిన మురళి, జంగి స్వామి, బాజా నాగరాజు పాల్గొన్నారు.
- October 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- మెదక్
- CHELMEDA
- NIZAMPET
- RAMAYAMPET
- WARANGAL
- చల్మెడ
- నిజాంపేట
- నియంత్రిత సాగు
- రామాయంపేట
- వరంగల్
- Comments Off on పంట ఎండింది.. గుండె మండింది