Breaking News

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జతచేశారు. ఇది ఫ్యూచర్లో చిరు చేయబోతున్న పాత్ర తాలూకూ లుక్ గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.