మెగాబ్రదర్ నాగబాబు కూతురు, నటి నిహారిక.. ఎంగేజ్మెంట్ గురువారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో నిరాడంబరంగా జరిగింది. గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు చైతన్యతో నిహారిక పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కాగా, కేవలం కొంతమంది అతిథులు మధ్య ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక ‘ఒక మనసు’ చిత్రం ద్వారా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. చివరగా ‘సూర్యకాంతం’ అనే చిత్రంలో నటించింది. గతంలో కొన్ని వెబ్సీరిస్లు, టీవీ షోలో నిహారిక నటించి మెప్పించింది.
- August 14, 2020
- Archive
- Top News
- సినిమా
- CHIRANJEEVI
- ENGAGEMENT
- HYDERABAD
- NIHARIKA
- TOLLYWOOD
- ఉపాసన
- టాలీవుడ్
- నటి
- నాగబాబు
- Comments Off on నిరాడంబరంగా నిహారిక ఎంగేజ్మెంట్