బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అధ్వాని తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మమ్మ చెప్పిన ఓ హోంరెమిడిని ఈ అమ్మడు ఇప్పటికీ వాడుతుందట. అందుకే ఇప్పటికే తరగని అందంతో మెరిపోతుందట. ఇంతకీ ఆ రెమిడీ ఏమిటంటే.. ‘తేనె, శనగపిండి, ప్రేష్క్రీమ్, పాలు, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు పడుకొనే మందు కొన్ని నిమిషాలపెట్టు ఫేస్‌కు ప్యాక్‌గా పెట్టుకుంటాను. ఆ మిశ్రమం నా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాక నేను ఒత్తడి నుంచి దూరమై పోయి. రిలాక్స్ అవుతాను. ఇది ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకుంటాను కాబట్టి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవు’ అని చెప్పింది కియారా.. ఇంకే మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ప్యాక్‌ను తయారు చేసుకోండి. తెలుగులో ‘భరత్అనేనేను’ చిత్రంతో కియారా భారీ హిట్ అందుకున్నది. అయితే ‘వినయవిధేయరామ’ చిత్రం పరాజయం పాలవ్వడంతో ఆమె బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ వరస హిట్లు పడటంతో ప్రస్తుతం టాప్‌హీరోయిన్‌గా చలామణి అవుతున్నది. తెలుగులో మరోసినిమా చేయాలంటూ సినీప్రియులు కోరుతున్నారు. మరి ఎప్పటికి.. ఎవరితో తెలుగులో జతకడుతుందో వేచిచూడాలి.