సారథి న్యూస్, పాలకొండ: పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి ఆమదాలవలస మండలం, సచివాలయంలో ఉన్న ఉమెన్స్ ప్రొడక్షన్ (మహిళా పోలీసులు) తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ పీఎం శ్రావణి మాట్లాడుతూ.. నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.శంకర్రావు, పాలకొండ ఎస్సై ఆర్ జనార్దన్ రావు, వీరఘట్టం మండలం ఎస్సై జి.భాస్కర్ రావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
- November 24, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMUDALAVALASA
- ANDRAPRADESH
- PALAKONDA
- SRIKAKULAM
- ఆంధ్రప్రదేశ్
- ఆముదాలవలస
- నాటుసారా
- పాలకొండ
- శ్రీకాకుళం
- Comments Off on నాటుసారా తయారీని అడ్డుకుందాం