వాషింగ్టన్: నవంబర్ 3 నాటికి కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ను అమెరికానే తయారు చేస్తుందని ఆయన చెప్పారు. ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు అమెరికా సంస్థలు వ్యాక్సిన్ తయారీలో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది నవంబర్ 3నే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే ట్రంప్ ఈ వాఖ్యలు చేశారని.. అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువకాగా ఇప్పటివరకూ 1.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
- August 7, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMERICA
- ELECTIONS
- NOVEMBER
- PRESIDENT
- TRUMP
- VACCINE
- అమెరికా అధ్యక్షుడు
- కరోనా వ్యాక్సిన్
- Comments Off on నవంబర్లో కరోనా వాక్సిన్