మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఆమె ముంబై నుంచి పుణె వెళ్లింది. తర్వాత ఆమెకు గొంతునొప్పి, తీవ్రజ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యుల కూడా క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. నటాషా సూరి 2016 మలయాళ సినిమా ‘కింగ్ లయర్’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్‌తో కలిసి ‘డేంజరస్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారం కానుంది. విక్రమ్ భట్ రాసిన ఈ వెబ్ సిరీస్.. భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగస్టు 14 న ప్రీమియర్ కానుంది.