సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న ఆయన పుట్టిన రోజున క్రీడాదినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. సామాన్యుడు పట్టుదలతో ఆడితే ఏదైనా సాధిస్తాడని అనడానికి ధ్యాన్ చంద్ జీవితమే నిదర్శనమన్నారు. కరోనా దృష్ట్యా ప్రతిరోజు 15 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ యోగా చేసి ఫిట్ తెలంగాణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- August 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- DYANCHAND
- MINISTER SRINIVASGOUD
- OLYMPICS
- TELANGANA
- జాతీయ క్రీడాదినోత్సవం
- తెలంగాణ
- ధ్యాన్ చంద్
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- Comments Off on ధ్యాన్ చంద్ జీవితం.. అందరికీ ఆదర్శం