సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్‌షాప్‌లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం శాంతినగర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 17 కాటన్ల మద్యం, తులం బంగారం, రూ. 2.80 లక్షలు నగదు, బొలేరో వాహనం, గ్యాస్‌కట్టర్, గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని గద్వాల ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు.
- August 24, 2020
- Archive
- క్రైమ్
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ARREST
- GADWAL
- GANG
- POLICE
- RIDES
- అరెస్ట్
- దొంగలముఠా
- పోలీస్
- Comments Off on దొంగలముఠా దొరికిందిలా..