Breaking News

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు

సారథి న్యూస్, మెదక్: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా రోడ్ల పరిస్థితిపై హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ కోతకు గురయ్యాయన్నారు. ఆర్అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు‌ చేపట్టాలని సూచించారు. యుద్ధప్రాతిపదికన, శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. జీవోనం.2 కింద మరమ్మతు పనులు‌ తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ములుగు- కరుక పట్ల రోడ్డు పనులు వేగవంతం చేయాలని, గజ్వేల్, పాండవుల‌ చెరువు వద్ద రోడ్డు దారుణంగా దెబ్బతిందని, వెంటనే బాగుచేయలని ఆదేశించారు. అలాగే గజ్వేల్ రింగ్ రోడ్ పనులు చేపట్టాలన్నారు. రింగ్ రోడ్ లో ముట్రాజ్ పల్లి, పాత ఆర్డీవో ఆఫీసు, పిడిచెడ్ రోడ్, రిమ్మనగూడ రోడ్ కంప్లీట్​చేయాలన్నారు. జహీరాబాద్ రోడ్ లో‌‌‌ డ్రైన్లు‌ లేకపోవడం‌తో వర్షపు నీరు నిలిచి ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడుతున్నారని వివరించారు.