సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్అలీ, సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాఫసియోద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
- September 25, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CABLEBRIDGE
- DURGAMCHERUVU
- KTR
- కేబుల్ బ్రిడ్జి
- దుర్గం చెరువు
- మంత్రి కేటీఆర్
- హైదరాబాద్
- Comments Off on దుర్గం చెరువు జిగేల్