సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని కరోనా కేసులు రోజు రోజుకూ రెట్టింపు అవుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని ఇందులో కూడా పారదర్శకత లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 32.1 శాతంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వానికి కరోనా పట్ల మార్గదర్శకాలు జారీచేయాలని కోరారు.
- June 29, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- REVANTHREDDY
- TELANGANA
- ఎ.రేవంత్రెడ్డి
- కరోనా
- తెలంగాణ
- Comments Off on దారుణంగా కరోనా పరిస్థితి