సారథి న్యూస్, హైదరాబాద్: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున అదేరోజు సీఎం స్వయంగా ధరణి పోర్టల్ ను అదేరోజు ప్రారంభించాలని భావిస్తున్నారు. అప్పటిలోగా అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, బ్యాండ్ ఏర్పాట్లు వంటి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ విధానం, మోటివేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను ఆప్ డేట్ చేయడం తదితర విధివిధానాలపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదివరకు ఉన్న రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్స్‌లు ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
- September 26, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- TELANGANA
- VIJAYADASAMI
- తెలంగాణ
- దసరా
- విజయదశమి
- సీఎం కేసీఆర్
- Comments Off on దసరాకు ధరణి పోర్టల్ ప్రారంభం