సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో(24 గంటల్లో) ఆదివారం 2,924 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,23,090 పాజిటివ్కేసుల నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 818 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 31,284 ఉన్నాయి. 24 గంటల్లో 61,148 శాంపిళ్ల టెస్టులు చేశారు. ఇప్పటివరకు 13,27,791 పరీక్షలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 461 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 36, భద్రాద్రి కొత్తగూడెం 88, జగిత్యాల 92, జనగాం 46, జయశంకర్ భూపాలపల్లి 24, జోగుళాంబ గద్వాల 35, కామారెడ్డి 56, కరీంనగర్172, ఖమ్మం 181, మహబూబ్‌నగర్ 58, మహబూబాబాద్ 80, మంచిర్యాల 91, మెదక్ 45, మేడ్చల్ మల్కాజిగిరి 153, ములుగు 34, నాగర్‌కర్నూల్ 51, నల్లగొండ 171, నిర్మల్ 33, నిజామాబాద్140, పెద్దపల్లి 83, రాజన్నసిరిసిల్ల 55, రంగారెడ్డి 213, సంగారెడ్డి 44, సిద్దిపేట 97, సూర్యాపేట 118, వనపర్తి 46, వరంగల్అర్బన్ 102, యాదాద్రి భువనగిరి 64 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.