సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ లో 13, సంగారెడ్డి జిల్లాలో 21 చొప్పున మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. రాష్ట్రంలో 8,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్బులెటిన్లో పేర్కొంది.
- June 30, 2020
- Archive
- తెలంగాణ
- CARONA
- GHMC
- HYDERABAD
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 945 పాజిటివ్ కేసులు