సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) 2,817 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో చేరిన కరోనా సంఖ్య 1,33,406కు చేరింది. తాజాగా వ్యాధిబారినపడి 10 మంది మృతిచెందారు. కరోనా మృతుల సంఖ్య 856కు చేరింది. వ్యాధి నుంచి తాజాగా 2,611 మంది కోలుకోగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,00,013 కు చేరింది. ప్రస్తుతం 32,537 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్లో 25,293 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 452 కేసులు నమోదయ్యాయి.
ఇలా జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్36, భద్రాద్రి కొత్తగూడెం 89, జగిత్యాల 88, జనగాం 41, జయశంకర్ భూపాలపల్లి 26, జోగుళాంబ గద్వాల జిల్లా 33, కామారెడ్డి 62, కరీంనగర్164, ఖమ్మం 157, మహబూబ్నగర్42, మహబూబాబాద్62, మంచిర్యాల 71, మెదక్35, మేడ్చల్మల్కాజిగిరి 129, నాగర్కర్నూల్41, నల్లగొండ 157, నిజామాబాద్97, పెద్దపల్లి 75, సిరిసిల్ల 53, రంగారెడ్డి 216, సంగారెడ్డి 76, సిద్దిపేట 120, సూర్యాపేట 116, వికారాబాద్27, వనపర్తి 45, వరంగల్రూరల్46, వరంగల్అర్బన్114, యాద్రాద్రి భువనగిరి 73 చొప్పున పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.