Breaking News

తెలంగాణలో 2,751 కరోనా కేసులు

తెలంగాణలో 2,751 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) కొత్తగా 2,751 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,20,116 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 9 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 808కు చేరింది. తాజాగా 1,675 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 89,350 మంది కోలుకుని ఇంటికి చేరారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 76.49 శాతంగా నమోదైంది. తెలంగాణలో రికవరీ రేటు 74.3 శాతం ఉంది. ఒకేరోజు అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 432 కేసులు నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్​

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్‌ జిల్లాలో 128, ఆదిలాబాద్ 30, భద్రాద్రి కొత్తగూడెం 72, జగిత్యాల 88, జనగామ 42, జోగుళాంబ గద్వాల 39, కామారెడ్డి 65, ఖమ్మం 132, కరీంనగర్​192, మహబూబ్​నగర్ 64, మహబూబాబాద్​75, మంచిర్యాల 86, మెదక్​35, నల్లగొండ 147, నాగర్​కర్నూల్​54, నిర్మల్​43, నిజామాబాద్​113, పెద్దపల్లి 97, రాజన్నసిరిసిల్ల 48, సంగారెడ్డి 42, సిద్దిపేట 96, సూర్యాపేట 111, వనపర్తి 63, వరంగల్​రూరల్​30, వరంగల్​అర్బన్​101, యాదాద్రి భువనగిరి 58 చొప్పున పాజిటివ్​కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యాశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.