సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా(శనివారం) 2,511 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. వైద్యాధికారులు 24 గంటల్లో 62,132 నమూనాలను పరీక్షించారు. మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,579 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,04,603కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,915 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 16,67,653 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇదిలాఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 305 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.