సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,986 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 62,703కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 519 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 16,796 ఉన్నాయి. జిల్లాల వారీగా..అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 29, జనగాం 21, జోగుళాంబ గద్వాల 32, కామారెడ్డి 46, కరీంనగర్ 116, ఖమ్మం 41, మహబూబ్ నగర్ 61, మహబూబాబాద్37, మంచిర్యాల 35, మెదక్ 45, మేడ్చల్ 207, ములుగు 27, నాగర్‌కర్నూల్ 30, నల్లగొండ 36, పెద్దపల్లి 26, సిరిసిల్ల 23, రంగారెడ్డి 205, సంగారెడ్డి 108, సిద్దిపేట 20, వనపర్తి 18, వరంగల్అర్బన్123 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.
- July 31, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- COVID19
- HYDERABAD
- TELANGANA
- కోవిడ్–19
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణలో 1,986 కేసులు