సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,897 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544 నమోదైంది. తాజాగా కరోనా బారినపడి 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 654కు చేరింది. 24 గంటల్లో 22,972 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇలా ఇప్పటివరకు 6,65,847 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇదిలాఉండగా, కరోనా నుంచి కొత్తగా 1920 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధిబారి నుంచి ఇప్పటివరకు 61,294 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 69.79శాతం ఉండగా, తెలంగాణలో రికవరీ రేటు 72.49 శాతంగా నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్‌ను విడుదల చేసింది.