సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 93,937 మొత్తం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 711కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల్లో 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల నుంచి కోలుకుని 2,070 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 72,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,024 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 7,72,928 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 76.86 శాతంగా నమోదైంది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 235 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 27, జగత్యాల 59, జనగాం 32, జోగుళాంబ గద్వాల 69, కామారెడ్డి 44, కరీంనగర్88, ఖమ్మం 45, మహబూబ్నగర్32, మంచిర్యాల 79, మెదక్36, మేడ్చల్ మల్కాజిగిరి106, నాగర్కర్నూల్ 30, నల్లగొండ 38, నిర్మల్27, నిజామాబాద్ 94, రంగారెడ్డి 166, సిద్దిపేట 47, సూర్యాపేట 39 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.