సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో 15,654 మంది నమూనాలను పరీక్షించగా, వారిలో 1,593 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 641 కరోనా కేసులు నమోదయ్యాయి, శనివారం మీడియా బులెటిన్ విడుదల చేయని ప్రభుత్వం అన్ని వివరాలతో ఆదివారం రిలీజ్ చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 54,059కు చేరింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 12,264 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 463కు చేరింది.
ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 641 కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే జనగాం 21, కామారెడ్డి 36, కరీంనగర్51, ఖమ్మం 18, మహబూబ్ నగర్38, మహబూబాబాద్29, మంచిర్యాల 27, మెదక్21, మేడ్చల్91, నాగర్కర్నూల్46, నిజామాబాద్32, పెద్దపల్లి 16, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 171, సంగారెడ్డి 61, సూర్యాపేట22, వరంగల్రూరల్21, వరంగల్అర్బన్131 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.