సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 510 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్76, సంగారెడ్డి 10, వరంగల్అర్బన్73, కరీంనగర్87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్13, మహబూబ్నగర్50, భూపాలపల్లి 26, నల్లగొండ 24, నాగర్కర్నూల్27, జనగాం 12, నిజామాబాద్31, సూర్యాపేట 12 చొప్పున పాజిటివ్కేసులు రికార్డు అయ్యాయి.
- July 20, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- POSITIVE CASES
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- పాజిటివ్కేసులు
- Comments Off on తెలంగాణలో 1,198 కేసులు