Breaking News

తెలంగాణలో కోవిడ్​ కాల్​సెంటర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రం కోవిడ్​ బాధితుల కోసం ఓ కాల్​సెంటర్​ను ఏర్పాటు చేసింది. ఈ కాల్​సెంటర్​ ద్వారా కోవిడి పాజిటివ్​ బాధితులు హోం ఐసోలేషన్​లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించనున్నారు. 18005994455 టోల్​ఫ్రీ నంబర్​కు కాల్​చేసి సూచనలు పొందవచ్చు. వ్యాధి తీవ్రత సాధారణంగా ఉన్నవారికి 17 రోజులపాటు నిపుణులు ఫోన్​లో సూచనలు ఇస్తారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి టెలీ మెడిసిన్​ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తారు. రెండువిడుతల్లో సుమారు 200 మంది ప్రతినిధులు బాధితులకు సేవలు అందిస్తారు. హోం ఇసోలేషన్లో ఉన్న కోవిడ్ బాధితులు తీసుకోవలసిన జాగ్రతలు, సమతూల్య ఆహారం, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, సలహాలు, సూచనలు చేస్తారు. ఎవరైనా కోవిడ్ భాదితులు తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్య లేదా ఛాతి నొప్పితో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు దవాఖానకు తరలిస్తారు. కోవిడ్​ బాధితులు, కరోనా లక్షణాలు ఉన్నవారు