సారథి న్యూస్, హైదరాబాద్: కృష్ణానది యాజమాన్య బోర్డు తెలంగాణ రాష్ట్రానికి 36 టీఎంసీలు, ఏపీకి 17 టీఎంసీలను కేటాయించింది. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణా బోర్డు స్పందించింది. అయితే తెలంగాణ అడిగిన క్యారీ ఓవర్ నీటి విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణకు కేటాయించిన నీటిని ఆగస్టు 31 వరకు వాడుకునేలా కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు ఇచ్చింది. మరోవైపు ఏపీ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
- August 5, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- AP
- KRISHNABOARD
- TELANGANA
- ఏపీ
- తెలంగాణ
- Comments Off on తెలంగాణకు 36, ఏపీకి 17 టీఎంసీలు