సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. కరోనాకు ముందు రాష్ట్రంలో రోజూ ఐదువేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడడంతో ఆదాయం స్తంభించిపోయింది. మే నెలలో తిరిగి ప్రారంభమైనా జూన్, జూలై మాసాల్లో ఆశించిన మేర లావాదేవీలు జరగలేదు. ప్రజల వద్ద నగదు లభ్యత లేకపోవడం, రుణాల మంజూరుకు ఆటంకాలు ఏర్పడడం, కరోనా వైరస్ భయంతో రిజిస్ట్రేషన్లకు జనం పెద్దగా ముందుకు రాలేదు. కానీ, జూలైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం, జూలైలో శ్రావణమాసం రావడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పుంజుకున్నాయి.
- August 14, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- INCOME
- REGISTRATION
- TELANGANA
- తెలంగాణ
- రిజిస్ట్రేషన్లశాఖ
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on తెలంగాణకు కాసులపంట