సారథి న్యూస్, రామాయంపేట: పంటలను ఆశించే తెగుళ్లను సకాలంలో అరికడితేనే అధిక దిగుబడి సాధించవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చల్మేడ గ్రామంలో జాతీయ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులకు విత్తనోత్పత్తి చేసే రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విత్తనోత్పత్తి లో తీసుకోవాల్సిన మెలకువలు, పంటను ఆశించు తెగుళ్లు, పురుగులు అరికట్టేవిధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గణేశ్‌కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి, రైతులు శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, తిర్మలయ్య పాల్గొన్నారు.
- October 6, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AGRICULTURE
- CM KCR
- HYDERABAD
- KTR
- NIRANJANREDDY
- TELANGANA
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on తెగుళ్లను అరికడదాం