Breaking News

తళపతి విజయ్​కి బెదిరింపు

తమిళ హీరో విజయ్​కు బెదిరింపు కాల్

దమిళ అగ్రనటుడు, తళపతి విజయ్​కు బెదిరింపు కాల్​ వచ్చింది. దీంతో పోలీస్​శాఖ అప్రమత్తమైంది. లాక్​డౌన్​తో సినిమా షూటింగ్​లన్నీ ఆగిపోయాయి. తాజాగా ప్రభుత్వం షూటింగ్​లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో నటులెవరూ షూటింగ్​లలో పాల్గొనడం లేదు. విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్నాడు. లాక్​డౌన్​తో ఈ చిత్ర షూటింగ్​ నిలిపివేశారు. ఇదిలా ఉండగా హీరో విజయ్​ ఇంటికి బెదిరింపు కాల్స్​ వస్తున్నాయి. బాంబులతో ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు ఫోన్​ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.