తమిళ హీరో, నిర్మాత విశాల్‌కు, ఆయన తండ్రికి కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. విశాల్‌కు కరోనా సోకిందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా విశాలే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. ‘ముందుగా మా నాన్న(జీకే రెడ్డి)కు కరోనా సోకింది. అతడికి నేను సేవలు చేశాను. దీంతో నాకు లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయుర్వేద మందులు వాడి నేను మా నాన్న ఈ మహమ్మారి నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేము క్షేమంగా ఉన్నాం. దయచేసి అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం విశాల్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘డిటెక్టివ్ 2’తో పాటు ‘చక్ర’ అనే సినిమాలోనూ కనిపించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రాల షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.