Breaking News

తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు

తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​కృతజ్ఞతలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తమిళనాడు సర్కారుకు సీఎం కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామగ్రిని కూడా పంపిణీ చేసేందుకు ముందుకురావడంపై ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామికి ధన్యవాదాలు తెలిపారు. భారీవర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రశంసించాడు. ఈ మేరకు సీఎం కేసీఆర్​ తమిళనాడు సీఎంకు లేఖరాశారు.