Breaking News

తమన్​ x మహేశ్​ ఫ్యాన్స్

మ్యూజిక్​ డైరెకట్ర్ తమన్​తో మహేశ్​ ప్యాన్స్​ రచ్చ

ఎప్పుడూ కూల్​గా ఉండే సంగీత దర్శకుడు తమన్​ ఓ చిన్న ట్వీట్​తో చిక్కుల్లో పడ్డాడు. ఆయన ట్విట్టర్లో వాడిన ఓ మాట మహేశ్​ బాబు అభిమానులకు కోపం తెప్పించింది. ఆయనపై మహేశ్​బాబు అభిమానులు సోషల్​ మీడియా వేదికగా ఓ రేంజ్​లో విరుచుకుపడుతున్నారు. పచ్చిబూతులతో ట్రోలింగ్​ మొదలుపెట్టారు. ఇంతకు వాళ్ల కోపానికి కారణం ఏమిటంటే.. ఈనెల 9న సూపర్​స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్​బాబు.. ట్విట్టర్​లో ఓ పోస్టుపెట్టాడు. తన పుట్టినరోజుకు అభిమానులు భారీగా గుమిగూడవద్దని, కరోనా విపత్తువేళ ఇండ్లవద్దే ఉండి వేడుకలను జరుపుకోవాలని ఆ ట్వీట్​ సారాంశం.

ఈ ట్వీట్​పై తమన్​ స్పందిస్తూ ‘మంచి నిర్ణయం బ్రదర్​’ అంటూ రీ ట్వీట్​చేశాడు. దీంతో రెచ్చిపోయిన మహేశ్​ అభిమానులు మా హీరోను బ్రదర్​ అంటావా.. నీకు ఎన్ని గుండెలు. నువ్వెంత నీ స్థాయి ఎంత.. వెంటనే ఆయనకు క్షమాపన చెప్పు. లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొంటావు. స్టార్​హీరో మహేశ్​బాబును.. నువ్వు ‘సర్​’ అని సంబోధించాలి. అంతేకాని బ్రదర్​ అంటావా? అని విరుచుకుపడ్డారు. అభిమానులు చిన్న విషయానికే రాద్దాంతం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఎప్పడూ ‘సర్​’ అని సంబోధించే తమన్​ ఇప్పడు మహేశ్​బాబును బ్రదర్​ అని పిలిచి అవమానించాడని వారు వాదిస్తున్నారు. ఈ దుమారం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.