ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో ఇప్పడందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసిస్తున్నారు. అత్యధిక టెస్టులు చేయడం.. సకాలంలో వైద్యం చేయడం, ప్రజలకు కరోనాపై విస్తృత అవగాహన కల్పించడమే కేజ్రీవాల్ విజయరహస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకోవడం కూడా కారణమని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో కరోనా కంట్రోల్లోకి రావడం స్వాగతించవలిసిన అంశమే. గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కేవలం 1,041 కేసుల మాత్రమే నమోదయ్యాయి. ఇప్పడు ఆరాష్ట్రంలో 14,554 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటులో ఢిల్లీ దూసుకుపోతున్నది. ఇప్పటివరకు 1,09,065 మంది కరోనానుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1,415 మంది కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరట నిచ్చే అంశమే. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ టెస్టుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో భవిష్యత్‌లో పెను ప్రమాదం పొంచి ఉన్నదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- July 24, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- CARONA TREATMENT
- DELHI
- KEJRIWAL
- అరవింద్ కేజ్రీవాల్
- కరోనా
- ఢిల్లీ
- Comments Off on ఢిల్లీలో పక్కాగా కట్టడి