సుశాంత్ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్, తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, నమ్రదా శిరోద్కర్‌కు ఎన్‌సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్‌సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్ ప్రీత్‌సింగ్‌కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్‌సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం వెలుగుచూసింది. అదేంటంటే డ్రగ్స్ కేసులో ప్రముఖ నిర్మాత మధు మంతెన ఉన్నట్టు సమాచారం. అయన రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాకు ప్రొడ్యూసర్. నిర్మాత మధు మంతెనకు ఎన్‌సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారని సమాచారం. ఆయన నేడు విచారణకు వెళ్తున్నారట. అనురాగ్ కశ్యప్, వికాల్ బాల్, విక్రమాదిత్యతో కలిసి ఫాంటమ్ ఫిలింస్‌ను స్టార్ట్ చేసిన మధు మంతెన తెలుగులో ఆర్జీవీ చిత్రం ‘రక్తచరిత్ర’ను నిర్మించారు.