బాలీవుడ్లో డ్రగ్స్‌కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్‌నేమ్‌లతో డ్రగ్స్‌ను విక్రయించినట్టు ఏన్సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని కోర్టు ఆదేశాలు జారిచేసింది. అయినప్పటికీ మరోసారి రకుల్ పేరు వినిపించడం గమనార్హం. అయితే వీరు డ్రగ్స్‌కేసులో నిందితులా, లేక బాధితులా అన్నవిషయం విచారణ తర్వాత బయటపడనున్నది.
- September 22, 2020
- Archive
- Top News
- సినిమా
- ACB
- BOLLYWOOD
- DEEPIKA
- DRUGS
- HYDERABAD
- MUMBAI
- SARA
- ఆంధ్రప్రదేశ్
- డ్రగ్స్
- డ్రగ్స్‌కేసు
- తెలంగాణ
- ముంబై
- హైదరాబాద్
- Comments Off on డ్రగ్స్‌కేసులో దీపికా, శ్రద్ధా పేర్లు..