Breaking News

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు

సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్‌లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్​ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. నాగర్ కర్నూల్ కలెక్టర్ ఎల్​.శర్మన్, ఎస్పీ సాయిశేఖర్​ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎన్ డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటికి రప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్​ ఎల్​.శర్మన్​
పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసు అధికారులు