‘మనసు మమత’, ‘మౌనరాగం’ తదితర సీరియల్స్‌లో నటించిన టీవీ నటి శ్రావణి మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపులతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడట్టు సమాచారం. శ్రావణి.. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పరిధిలోని మధురానగర్‌లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె బాత్రూంలోకి వెళ్లింది.. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యుల చూడగా.. బాత్రూంలో ఉరివేసుకుని విగతజీవిగా పడిఉంది. వారు వెంటనే యశోద దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుల ధ్రువీకరించారు.
శ్రావణికి కొంతకాలం క్రితం టిక్‌టాక్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజురెడ్డి అలియాస్ సన్నీ టిక్‌టాక్‌లో పరిచయమయ్యారు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని శ్రావణితో పరిచయం పెంచుకున్నాడు. అయితే ఇటీవల అతడు శ్రావణిని ప్రేమపేరుతో వేధించినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దేవరాజురెడ్డిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.