సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజంపై బాలీవుడ్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం టాలీవుడ్‌కు నెపోటిజం తాకింది. తాజాగా టాలీవుడ్‌లోనూ నెపోటిజం ఉందంటూ గోవా బ్యూటీ ఇలియానా హాట్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్ దాకా ఎందుకూ.. దక్షిణాదిన ఉన్న తెలుగు ఇండస్ట్రీలోనూ నెపోటిజం ఉంది. అక్కడ కూడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు వాళ్ల పిల్లలకే సినిమా అవకాశాలు ఇస్తారు. కొత్తవాళ్లకు, టాలెంట్ ఉన్న వాళ్లకు అక్కడ అవకాశాలు తక్కువే అని వ్యాఖ్యానించింది. ఇలియానా కామెంట్స్‌పై నెట్‌జన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఏ బ్యాగ్‌గ్రౌండ్ లేకున్నా ఇలియానాకు తెలుగులో ఎన్నో అవకాశాలు వచ్చాయి కదా.. ఈ విషయాన్ని ఆమె మరిచారా? అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.