అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ వాహనాల కేసులో ఆయన కొంతకాలం క్రితం అరెస్టయిన జేసీ.. కోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ అనుచరులు రెచ్చిపోయారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓ సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. పబ్లిక్‌గా ఆయనను బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా కండీషన్ బెయిల్‌లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ శుక్రవారం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఐతో దురుసుగా ప్రవర్తించడంపై జేసీని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో తాడిపత్రిలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
- August 7, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- JAIL
- JC BROTHERS
- KADAPA
- అరెస్ట్
- ప్రభాకర్‌రెడ్డి
- Comments Off on జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ అరెస్ట్?