Breaking News

జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి


సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్​లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్​కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్​నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్​నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ నుంచి లక్ష్మయ్య, H-142 నుంచి వెంకట్​రెడ్డి, ఎస్ టీఎస్ఈ నుంచి రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.