Breaking News

జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఖరారు

  • డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితా సిద్ధం
  • ఎస్టీలకు-2, ఎస్సీలకు -10, బీసీలకు- 50
  • మహిళలకు 75 స్థానాల కేటాయింపు
  • అన్‌ రిజర్వ్​డ్​ డివిజన్లు 44
  • అంతా రెడీచేసిన బల్దియా అధికారులు

హైదరాబాద్: హైదరాబాద్ ​మహానగర పాలకమండలి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు ఈ దఫా కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు మొత్తం 150 స్థానాలకు గానూ జీహెచ్​ఎంసీ అధికారులు డివిజన్ల వారీగా రిజర్వేషన్ల లిస్టును సిద్ధం చేశారు. ఇందులో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు 10 స్థానాలు రిజర్వు కాగా, మొత్తంగా మహిళలకు 75 డివిజన్లను కేటాయించారు. 44 స్థానాలు అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీలో ఉన్నాయి.
ఎస్టీ(జనరల్‌): ఫలక్‌ నుమా
ఎస్టీ(మహిళ): హస్తినాపురం
ఎస్సీ(జనరల్‌): కాప్రా, మీర్‌పేట్‌, హెచ్‌బీ కాలనీ, జియాగూడ, మచ్చబొల్లారం& వెంకటాపురం
ఎస్సీ(మహిళ): రాజేంద్రనగర్‌, అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్‌పేట్‌, కవాడిగూడ
బీసీ(జనరల్‌): చర్లపల్లి, సిఖ్‌చావ్నీ, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహల్‌, పురానాపూల్‌, దూద్‌బౌలి, జహనుమా, రామ్‌నాస్‌పురా, కిషన్‌బాగ్‌, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్‌, కార్వాన్‌, నానల్‌నగర్‌, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌, అంబర్‌పేట, భోలక్‌పూర్‌, బోరబండ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్‌.
బీసీ(మహిళ): రామంతాపూర్‌, ఓల్డ్‌ మలక్‌పేట, తలాబ్‌ చంచలం, గౌలిపుర, కుర్మగూడ, కంచన్‌బాగ్‌, బార్కాస్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట, ఘాన్సీబజార్‌, సులేమాన్‌ నగర్‌, అత్తాపూర్‌, మంగళ్‌హాట్‌, గోల్కొండ, టోలీచౌకీ, ఆసిఫ్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, అహ్మద్‌నగర్‌, మల్లేపల్లి, రెడ్‌హిల్స్‌, గోల్నాక, ముషీరాబాద్‌, ఎర్రగడ్డ, చింతల్‌, బౌద్ధనగర్‌, రామ్‌గోపాల్‌పేట్‌.
మహిళ(జనరల్‌): డాక్టర్​ ఎ.ఎస్‌.రావు నగర్‌, నాచారం, చిలుకానగర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌, రామకృష్ణాపురం, సైదాబాద్‌, ముసారాంబాగ్‌, ఆజంపురా, మొగల్‌పురా, ఐఎస్‌ సదన్‌, లంగర్‌హౌస్‌, గన్‌ఫౌండ్రీ, హిమాయత్‌నగర్‌, కాచిగూడ, నల్లకుంట, బాగ్‌అంబర్‌పేట్‌, అడిక్‌మెట్‌, గాంధీనగర్‌, ఖైరతాబాద్‌, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, హఫీజ్‌పేట్‌, చందానగర్‌, భారతీనగర్‌, బాలాజీనగర్‌, అల్లాపూర్‌, వీవీ నగర్‌, సుభాష్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, అల్వాల్‌, నేరేడ్‌మెట్‌, వినాయకనగర్‌, మౌలాలీ, గౌతంనగర్‌, తార్నాక, సీతాఫల్‌మండి, బేగంపేట్‌, మోండా మార్కెట్‌.
అన్​రిజర్వ్​డ్: మల్లాపూర్‌, మన్సూరాబాద్‌, హయాత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, చంపాపేట్‌, లింగోజిగూడ, కొత్తపేట్‌, చైతన్యపురి, గడ్డిఅన్నారం, అక్బర్‌బాగ్‌, డబీర్‌పురా, రెయిన్‌బజార్‌, పత్తర్‌గట్టి, లలితాబాగ్‌, రియాసత్‌నగర్‌, ఉప్పుగూడ, జంగంమెట్, బేగంబజార్‌, మైలార్‌దేవ్‌పల్లి, జాంబాగ్‌, రాంనగర్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్‌, రహ్మత్‌నగర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, మియాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట్‌, ఫతేనగర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, సూరారం, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌, మల్కాజిగిరి.