Breaking News

జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు ఆమోదం

జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు ఆమోదం

సారథి న్యూస్​, హైదరాబాద్: జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లుకు మంగళవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఐదు సవరణలు చేసిన బిల్లును మున్సిపల్​ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. అనంతరం బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఐదు స‌వ‌ర‌ణ‌లు ఇవే
1.మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ జీహెచ్ఎంసీ చ‌ట్టస‌వ‌ర‌ణ బిల్లుకు స‌భ ఆమోదం తెలిపింది. 2015లో ఒక ప్రత్యేక జీవో ద్వారా కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు 50శాతం స్థానాల‌ను మ‌హిళ‌ల‌కే ఆమోదించుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. మ‌హిళా సాధికార‌త‌కు పెద్దపీట వేయాల‌నే ఆలోచ‌న‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లకు చ‌ట్టం చేసుకుంటున్నామ‌ని తెలిపారు.బీసీల రిజ‌ర్వేష‌న్లు య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

2.జీహెచ్ఎంసీ ప‌రిధిలో గ‌తంలో 2.5 శాతం ఉన్న గ్రీన్ బ‌డ్జెట్‌ను 10 శాతానికి పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో 5 నుంచి 6 శాతం గ్రీన్ క‌వ‌ర్ పెరిగింద‌ని కేంద్రం ఓ నివేదిక విడుద‌ల చేసిందన్నారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ చ‌ట్టంలో 10 శాతం బ‌డ్జెట్‌ను గ్రీన్ క‌వ‌ర్‌కు కేటాయించామ‌న్నారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న న‌గ‌రాన్ని హ‌రిత‌న‌గ‌రంగా మార్చేందుకు ఈ స‌వ‌ర‌ణ ఉప‌యోగప‌డుతుంద‌న్నారు. జీహెచ్ఎంసీ చ‌ట్టస‌వ‌ర‌ణ బిల్లులో భాగంగా పదేళ్లకు ఒకసారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌భ ఆమోదం తెలిపింది. మాటిమాటికి రిజ‌ర్వేష‌న్లు మార్చడం ద్వారా ప్రజాప్రతినిధులకు జ‌వాబుదారీత‌నం లేకుండా పోతుందన్నారు. రెండు ట‌ర్మ్‌లు ఒకే రిజ‌ర్వేష‌న్ ఉండేలా పంచాయ‌తీరాజ్‌, మున్సిపల్​ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. దీనివ‌ల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మ‌రింత చేరువై అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

4.50 శాతం మ‌హిళ‌లు ఉండేలా నాలుగు ర‌కాల వార్డు వలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌భ ఆమోదం తెలిపింది. న‌గ‌ర అభివృద్ధిలో ప్రజల భాగ‌స్వామ్యం పెంచేందుకే వార్డు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వార్డు క‌మిటీల ఏర్పాటు ఉంటుంద‌న్నారు. యూత్ క‌మిటీ, మ‌హిళా క‌మిటీ, సీనియ‌ర్ సిటిజన్ క‌మిటీ, ఎమినెంట్‌ సిటిజెన్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి స్పష్టంచేశారు. క‌మిటీల్లో అన్నివ‌ర్గాల వారికి అవ‌కాశం కల్పిస్తామన్నారు.

5.ఎన్నిక‌ల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీ సంప్రదించాలని జీహెచ్ఎంసీ చ‌ట్టస‌వ‌ర‌ణ చేశారు. దీనికి కూడా స‌భ ఆమోదం తెలిపింది.