Breaking News

జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

సారథి న్యూస్, హైద‌రాబాద్: పెరుగుతున్న జ‌నాభా, ప‌ట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఎ.ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. సోమ‌వారం స‌న‌త్ న‌గ‌ర్ లోని పీసీబీ ఆఫీసులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ -19 బ‌యోమెడిక‌ల్ వేస్టేజీ నిర్వహణపై చర్చించారు. ఆస్పత్రుల్లో జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిరంతరం తనిఖీలు నిర్వహించాల‌న్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న కంపెనీలకు నోటీసులు జారీచేసి, మారకపోతే లైసెన్స్ రెన్యువల్ చేయాలని సూచించారు
టీఎస్ ఎయిర్ మొబైల్ యాప్ ఆవిష్కరణ
త‌మ నివాసప్రాంతంలో ఉన్న వాయు నాణ్యత సూచికను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన టీఎస్ ఏయిర్ (TSAIR APP) ప్రత్యేక మొబైల్​యాప్​ను మంత్రి ఏ.ఇంద్రకరణ్​రెడ్డి ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ యూజ‌ర్లు గూగుల్ ప్లే, ఐవోఎస్ యూజ‌ర్లు యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. స‌మావేశంలో కాలుష్య నియంత్రణ మండ‌లి స‌భ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్, సీఈ విశ్వనాథం, జేసీఈ సీవై న‌గేష్, జేసీఈఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు.