లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విక్రమ్ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తమ మేనకోడలిని ఏడిపించిన దుండగులే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారాని విక్రమ్ జోషి సోదరుడు తెలిపాడు. విక్రమ్ జోషిని ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి ఇంత వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని విక్రమ్‌జోషి సోదరుడు తెలిపాడు.
- July 22, 2020
- Archive
- జాతీయం
- ATTACK
- FIRE
- JOURNALIST
- POLICE
- UP
- ఉత్తరప్రదేశ్
- ఘజియాబాద్
- Comments Off on జర్నలిస్టుపై కాల్పులు