Breaking News

‘జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు’

జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు

సారథి న్యూస్​, కర్నూలు: సీఎం వైఎస్ ​జగన్ మోహన్​రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.బుధవారం డోన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రిగా అనర్హుడని విమర్శించారు. శక్తికి మించి అప్పులు చేయడం వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం జగన్ మోహన్​రెడ్డి 15నెలల పరిపాలన కాలంలోనే రూ.1.25లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఇమిడి సాయి, జిల్లా కార్యదర్శి ఉన్నిగొర్ల జనార్ధన్ యాదవ్, మరిశెట్టి సునీత, శేషయ్య, అశోక్ రత్నం, ఐఎన్​టీయూసీ జిల్లా నాయకులు పఠాన్ హబీబ్ ఖాన్ ఉన్నారు.