తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి కృషిచేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపథ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యేలందరినీ పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృథాకాకుండా చర్యలు చేపట్టారు.
- June 20, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- CHEVIREDDY
- YS JAGAN
- తిరుపతి
- రాజ్యసభ
- Comments Off on చెవిరెడ్డికి సీఎం జగన్ అభినందనలు